నీ నామమే మాశ్వాసా స్వామియే శరణమయ్యప్పా
అడవుల్లో వెలిగే దీపమా భక్తుల గుండెల్లో వెలిగేదైవమా
స్వామియే శరణం అయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా
తల్లి శిరోబాధని మాప అడవిలోకెళ్లావు మనిషిగా
మహిషి బాధని మాపి మహిమ చూపావు మహిమాన్వితుడుగా
పులి వాహనుడివై పులిపాలు తెచ్చావు
అవతార పురుషుడివని లోకానికి చాటావు
నీ కరుణ చూపవయ్యా మణికంఠా
మా జీవితాల్లో వెలుగులునింప అయ్యప్పా శబరిమలవాసా హరిహర సుతా వీరమణికంఠా
నీ నామమే మాశ్వాసా స్వామియే శరణమయ్యప్పా
అడవుల్లో వెలిగేదీపమా భక్తుల గుండెల్లో వెలిగేదైవమా
స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా
మాలధారణలోన నిను చూడ వచ్చాము
పంబ తీరమందు పరిశుభృలుమయ్యాము
పదునెనిమిది మెట్లెక్కి నీసన్నిధికి చేర
నలభైఒక్క రోజుల దీక్షతోకొలిచాము
స్వామి నీదివ్య రూపంబు చూడగా
పాపాలన్నీ పారిపోయేవేళగా
గురుస్వామితో కూడి నీదరికి చేరాము
కన్నె స్వాములతోడ ఇరుముడులు కట్టాము
నీమొక్కు తీర్చగ నీకాడకొచ్చాము
మా తప్పులన్నీ క్షమించుస్వామీ
మా పిల్లాపాపల్ని సల్లంగా చూడు
నీ చల్లని దీవెనలతో మముకాపాడు అయ్యప్పా శబరిమలవాసా హరిహర సుతా వీరమణికంఠా
నీ నామమే మా శ్వాసా స్వామియే శరణం అయ్యప్పా
అడవుల్లో వెలిగే దీపమా భక్తుల గుండెల్లో వెలిగే దైవమా
స్వామియే శరణం అయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా
శబరిమల గిరిపై వెలసిన దేవా
భక్తుల పాలిట కలియుగ దైవమా
స్వామియే శరణం అయ్యప్పా…
స్వామియే శరణమయ్యప్పా…
రచన: అల్లెన కాశిదాస్
0 Comments