ఎన్జీఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎన్జేకెల క్రికెట్ ప్రీమియం లీగ్ లో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భాగంగా రేపటినుండి మూడు రోజులపాటు వీరఘట్టాం మండలం మరీ గిరి వద్ద క్వాటర్ ఫైనల్స్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇందుకోసం నాలుగు మండలాల టీమ్స్ యొక్క కెప్టెన్స్, అఫీషియల్స్, నిర్వాహకుల సమక్షంలో డ్రా వేయడం జరిగింది. రేపు జరగబోవు మ్యాచ్ లలో సీతంపేట వీరఘట్టాం ఫ్రెండ్స్ మధ్య, కృష్ణ యూత్ పాలకొండ బత్తిలి మధ్య, సామరిల్లీ బిటివాడ మధ్య, తంపటాపల్లి భామిని మధ్య పోటీలు ఉంటాయని నిర్వాహకులు నెల్లి వెంకటరమణ, వండాన రాజేంద్ర, మజ్జి రామకృష్ణ, జాకబ్, దయానంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్, పవన్, రాజేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments