పాలకొండ వెబ్ న్యూస్, మే 29, 2026:పాలకొండ నగర పంచాయతీ వార్డుల విభజన సక్రమంగా లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మన్మధరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక నగర పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని, దీనిని సరిచేసి 28 వార్డులుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తో కలిసి మాజీ కౌన్సిలర్స్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపారని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోయినా, తాము కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారిని కలవడం జరిగిందని చెప్పారు. ఓటర్ ఐడి, డోర్ నెంబర్లను ప్రామాణికంగా తీసుకొని ఏ వీధికి ఆ వీధి ఉంచేలా పద్ధతి ప్రకారం విభజన చేయాలన్నారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సహాయంతో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడగల వెంకటరమణ, కొడెం విజయ్ కుమార్, దుంపల రమేష్ బాబు, భాసూరు కాంతారావు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments