ఉద్యోగుల సమస్యలపై ఎర్ర బ్యాడ్జీలతో నిరసన

​పాలకొండ వెబ్ న్యూస్, 30-05-2026:
ఏపీ పిటిడి విజయనగరం జోన్ 1 లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కొరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు పాలకొండ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు రెండు రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలియజేశారు. స్త్రీ శక్తి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగి బస్సులు చాలక, పాత టిమ్ములు పనిచేయక డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిన్న తేడాలకే సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ల కోత విధించడం సరికాదని జోనల్ నాయకుడు వైకుంఠం డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అర్హులైన కండక్టర్లు, మెకానిక్‌లతో భర్తీ చేయాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు సులభంగా మంజూరు చేయాలని కోరారు. ఆన్ కాల్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈఎస్ఐ కార్డులు, పది లక్షల బీమా, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిఎల్ రావు, అధ్యక్షుడు ఎస్టి రావు, చైర్మన్ మజ్జి సుబ్బారావు, బివి రమణ, డీజే బాబు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments