పాలకొండలో సోమవారం సమావేశమైన నాగవంశం సంక్షేమ సంఘం సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తెలికాపు ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడిగా జరజాపు సూర్యనారాయణ(సూరిబాబు), ప్రధాన కార్యదర్శిగా హనుమంతు తమ్మారావు ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శులగా కొత్తకరి వెంకట సత్యనారాయణ, బుగత సత్తిబాబు, కోశాధికారిగా ఆనాపు జవరాజులతో పాటు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు సహాయ కార్యదర్శులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఉమామహేశ్వరరావు, తమ్మారావు మాట్లాడుతూ రాష్ట్ర నాగవంశం కమిటీ ఆదేశాల మేరకు పాలకొండ నుండి సాలూరు పరిసర ప్రాంతాల వరకు ఉండే నాగవంశీయులను పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో నాగవంశం కులస్తుల అభ్యున్నతికి, సంఘం బలోపేతానికి తామంతా సాయశక్తులా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments