పాలకొండ వెబ్ న్యూస్, మే 23: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ప్రతిపాదించిన వార్డుల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ పై సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత విభజనలో భౌగోళిక సమతూల్యత, పరిపాలన సౌలభ్యం లోపించాయని, ఓటర్ల జనాభా వివరాలను స్పష్టంగా పొందుపరచలేదని వారు విమర్శించారు. ఉదాహరణకు ఒకటో వార్డు పరిధిలోని ఎన్ఎస్ఎన్ కాలనీ ఓటర్లను రెండు, నాలుగు, ఇరవై వార్డులలో అశాస్త్రీయంగా కలిపేశారని ఆరోపించారు. దీనివల్ల ప్రజలకు జవాబుదారీతనం కరువై, వార్డుల అభివృద్ధి కుంటిపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో శాస్త్రీయంగా వార్డుల పునర్విభజన చేపట్టాలని కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజ్ఞాపన పత్రం సమర్పించిన వారిలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపి నాయుడు, పార్టీ సభ్యులు బుడితి భారతి తదితరులు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments