పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి

​పాలకొండ వెబ్ న్యూస్, మే 25: పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి ఇన్నేళ్లయినా జిల్లా సదుపాయాలకు నోచుకోకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ డిఆర్ఓ హేమలతకు దరఖాస్తు అందజేశారు. ప్రజా సంఘాల అభ్యర్థన మేరకు, పాత్రికేయ సమావేశాల నిర్వహణకు ప్రెస్ క్లబ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం జిల్లా వెనుకబాటుకు నిదర్శనమని, తక్షణమే తాత్కాలిక భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తీళ్ల గౌరీ శంకరరావు, చొక్కాపు వెంకటరమణ, పాలక రంజిత్ కుమార్, మర్రపు తిరుపతిరావు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments