కొత్త బోర్‌వెల్ పనులను పరిశీలించిన కమిషనర్ రతన్ రాజ్

పాలకొండ వెబ్ న్యూస్, 25 మే 2026: పాలకొండ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పట్టణంలో నీటి సమస్య పరిష్కారంలో భాగంగా ఆంపిలి వద్ద కొత్త బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. ఇన్నాళ్లూ ఇక్కడ ఉన్న పాత మోటార్ ద్వారా నీటి సరఫరా జరుగుతుండటంతో, అది తరచుగా నిలిచిపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యను గమనించిన అధికారులు త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఆంపిలి వద్ద జరుగుతున్న ఈ కొత్త బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులను కమిషనర్ రతన్ రాజ్ స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Post a Comment

0 Comments