దుర్గామృతం.. 1 : సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ।శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ॥

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ॥

సర్వమంగళ మాంగల్యే – సమస్త శుభాలకు మూలమైన తల్లీ!
శివే – శుభప్రదాయినీ!
సర్వార్థసాధికే – ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదించేవారూ!
శరణ్యే – శరణు కోరిన వారిని రక్షించేవారూ!
త్ర్యంబకే – మూడు నేత్రాలు కలిగిన దేవీ!
గౌరీ – నిర్మల స్వరూపిణీ!
నారాయణి – జగత్తును పరిపాలించే పరాశక్తీ!
నమోస్తుతే – నీకు నా ప్రణామాలు.

ప్రతి ఉదయం ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో పఠించి, "అమ్మా! నా ఆలోచనలు, మాటలు, చేతలు శుభమార్గంలో నడిచేలా అనుగ్రహించు" అని ప్రార్థిస్తే, మనసులో సానుకూల భావన పెరుగుతుంది. దైవస్మరణతో ప్రారంభమైన రోజు మరింత ప్రశాంతంగా గడుస్తుంది.
... శ్రీ దుర్గాయై నమః ॥ 🙏
..సేకరణ.. భాసురు శివ శంకర ప్రసాద్ 

Post a Comment

0 Comments