ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాలకొండలోని ఏఎంజీ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ద్వారా 150 మంది నుంచి రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందించారు. ఈ రక్తం అత్యవసర సమయంలో చాలామందికి ఉపయోగపడినందువలన సేవలను గుర్తిస్తూ శ్రీకాకుళంలో రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ను మెడల్, ప్రశంస పత్రంతో సన్మానించారు. ఈ సందర్భంగా పాలవలస విక్రాంత్ చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తమకు సహకరించాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కోరారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments