పాలకొండలో ఘనంగా 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 8, 2026: పాలకొండలోని శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం - యోగాంద్ర 2026 - కార్యక్రమం  నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి  సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 6.00 గంటల నుండి 7.30 నిమిషాల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఋషి యోగా కేంద్రం గురువులు ధనుంజయ రావు, జనార్ధనరావు, రామ్మోహనరావు, రామారావు ఆధ్వర్యంలో పలు ఆసనాలు వేయించారు. ఋషి యోగా కేంద్రం సాధక సభ్యులు వగైరా వారి అమూల్యమైన సహకారంతో ఈ యోగా కార్యక్రమం విజయవంతమైంది. నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను, శారీరక మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎలా పెంపొందిస్తుందో ఈ సందర్భంగా గురువులు వివరించారు. స్థానిక ప్రజలు, సాధకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

​పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments