పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డులో వీధిలైట్లు పగటిపూట కూడా వెలుగుతూనే ఉన్నాయి. ఉదయం సుమారు ఏడు గంటలు కావస్తున్నప్పటికీ ఈ లైట్లను ఆపకపోవడం పట్ల స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తును సక్రమమైన మార్గంలో, పొదుపుగా వాడాల్సి ఉండగా, అవసరం లేని సమయంలో కూడా ఇలా వృథా చేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నగర పంచాయతీ సిబ్బంది ప్రతి దినం ఉదయాన్నే స్పందించి ఈ వీధిలైట్లను ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
news by: BSS Prasad
0 Comments