శాఖా గ్రంధాలయంలో స్వచ్ఛభారత్ డ్రాయింగ్ పోటీలు

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 4, 2026:​పాలకొండలోని శాఖా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొంటున్న పిల్లలకు స్వచ్ఛభారత్ అంశంపై డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రంధాలయానికి చెందిన ఎక్కువ మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన పిల్లలకు ఈ నెల 6వ తేదీ శనివారం జరిగే వేసవి శిబిరం ముగింపు వేడుకలలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని సచివాలయం అడ్మిన్ కె . శివకుమార్ మరియు స్థానిక గ్రంధాల అధికారి బబ్బురు గణేష్ బాబు దగ్గరుండి పర్యవేక్షించారు.

Post a Comment

0 Comments