ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అభయహస్తం: ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 05-06-2026​పాలకొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు అనారోగ్య కారణముగా, అత్యవసరంగా జరిగిన వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సిఎంఆర్‌ఎఫ్ చెక్కును లబ్ధిదారులకు స్థానిక పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్,  గర్భాన సత్తిబాబు, తెదేపా సీనియర్ నాయకులు కర్నేనా అప్పలనాయుడు పాల్గొన్నారు.పాలకొండ మండలం గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన మడపల సాయిదుర్గాప్రసాద్ (చైల్డ్) సి/ఓ మడపల గౌరి కి రూ.41,601 రూపాయల విలువ గల చెక్కును వారు అందజేశారు.

Post a Comment

0 Comments