ఉత్తమ విత్తనోత్పత్తి రైతుగా ఖండాపు ప్రసాదరావుకు సన్మానం

​పాలకొండ వెబ్ న్యూస్, 05 జూన్, 2026: ​ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం సీతంపేటలో విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావును ఉత్తమ విత్తనోత్పత్తి రైతుగా ఎంపిక చేశారు. వ్యవసాయ రంగంలో ఆయన కనబరిచిన ప్రతిభకు, నాణ్యమైన విత్తనోత్పత్తికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. సీనియర్ సైంటిస్ట్ హెడ్ డా. వి.వెంకటరావు, పాలకొండ ఎడిఎ రత్నకుమారి, శాస్త్రవేత్త ఎ.డి. డా.రాజగోపాల్ ప్రసాదరావును దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విత్తనోత్పత్తిలో తోటి రైతులకు ఆయన ఆదర్శంగా నిలిచారని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments