జో జో బాలరామచంద్ర – జోలపాట

జో జో బాలరామచంద్ర – జోలపాట
పల్లవి
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

అనుపల్లవి
బువ్వ తిన్నావేళ మారాము చేస్తావు
ముసి ముసి నవ్వులతో మురిపిస్తువుంటావు ॥

చరణం 1
చంద్రుణ్ణి చూసి నువ్వు బువ్వారగిస్తావు
నీమోమునే చూసి చంద్రుడేమురిసే
బజ్జోర నాతండ్రి బజ్జోరనాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

చరణం 2
నీ ఆటపాటలు చూసి లోకమ్మే మురిసేను 
లోకాలనేలేటి నారామచంద్ర
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

చరణం 3
తండ్రికిచ్చిన మాటతో అడవుల్లోకెళ్లావు
అడవుల్లో కెళ్ళినువ్వు రాక్షసులను చంపావు
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

చరణం 4
సీతమ్మతోడ రాజ్యానికొచ్చావు
సీతమ్మనువిడిసి  క్షోబెంతో పడ్డావు
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

చరణం 5
అవతార పురుషుడిగా లోకంలో వెలిశావు
లోకానికేనువ్వు వెలుగుల్నినింపావు
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥

ముగింపు
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర
బజ్జోర నాతండ్రి బజ్జోర నాకన్నా
బజ్జోర నానాన్న బాలరామచంద్ర ॥॥
రచన : అల్లెన కాశీ దాస్..

Post a Comment

0 Comments