ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు పాలకొండ శాఖా గ్రంథాలయంలో 40 రోజులుగా జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలు గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ సీనియర్ నాయకులు నూతలపాటి భరత్ భూషణ్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కావని, అవి జ్ఞానానికి, ఆలోచనలకు స్ఫూర్తి కేంద్రాలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త విషయాలు నేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు జనార్ధన రావు మాట్లాడుతూ, పుస్తక పఠనంతో పాటు సృజనాత్మకత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. నగేష్ కుమార్ మాస్టారు మాట్లాడుతూ, పిల్లలకు లూసిడో రైటింగ్ నేర్పించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు, చింతపల్లి రేంజ్ ట్రైనింగ్ ఎఫ్ఆర్ఓ కె.మణికృష్ణ స్పాన్సర్ చేసిన మెమెంటోలను అతిథులు అందజేశారు. అనంతరం మండల వెంకటరమణ, నూకాల నగేష్ కుమార్, గొర్లె మురళి, యోగ గురువు జనార్దన రావులను గ్రంథాలయ అధికారి గణేష్ బాబు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
news by: BSS Prasad
0 Comments