పాలకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్టిసి కాంప్లెక్స్ లో దిగ్విజయంగా నడుస్తున్న చలివేంద్రం, మజ్జిగ సేవ

పాలకొండ వెబ్ న్యూస్, 06 జూన్, 2026:

​పాలకొండ ఆర్టిసి కాంప్లెక్స్ లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ సేవా కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పటివరకు ఎంతో చక్కగా కొనసాగుతుందని సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు, దాతల ఆర్థిక సహాయ సహకారాలతో నిరంతరాయంగా ముందుకు సాగుతోంది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ చలివేంద్రం ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఈ పుణ్యకార్య నిర్వహణలో ఆసక్తి గల భక్తులు ఎవరైనా పాల్గొని తమ వంతు సేవలు అందించవచ్చని, దాతలు కూడా ముందుకు రావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments