కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

​పాలకొండ వెబ్ న్యూస్, 07-06-2026

​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జూన్ 7 నుండి జూన్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో యోగా, మెడిటేషన్, జపం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఒత్తిడి నివారణ, ఏకాగ్రత పెంపు, ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వి.త్రినాథరావు, జిల్లా దేవాదాయ శాఖాధికారి ఎస్.రాజారావు, కార్యనిర్వహణాధికారి వి.వి. సూర్యనారాయణ కోరారు.

​News by: BSS Prasad

Post a Comment

0 Comments