విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శ

పాలకొండ వెబ్ న్యూస్, 10-06-2026:

​విశాఖపట్నం లోని సెవెన్ హిల్స్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసన సభ్యులు రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కంపెనీల నుండి ఇన్సూరెన్స్, పీఎఫ్ రూపంలో వచ్చే సొమ్మును చూపిస్తూ చేతులు దులుపుకోవడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున అదనంగా కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే 14 నెలల క్రితం జరిగిన ప్రమాద బాధితులకు కూడా ఇదే ప్యాకేజీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments