పాలకొండలో చలివేంద్రం ద్వారా మజ్జిగ, గ్లూకోజ్ పంపిణీ: కమిషనర్ నూకరాజు అభినందనలు

పాలకొండ వెబ్ న్యూస్, 11 జూన్ 2026.
​సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిరూపిస్తూ పాలకొండ శ్రీధర్మశాస్త్ర పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహం తీర్చేందుకు దాతల సహకారంతో ఈరోజు  చల్లని మజ్జిగ మరియు గ్లూకోజ్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు సందర్శించారు. స్థానిక ప్రజలకు ఇలాంటి క్లిష్ట సమయాల్లో అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. మానవత్వంతో స్పందించి చలివేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తినిస్తాయని, సేవా భావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments