పాలకొండలో విద్యార్థులకు ఐఐఎం ప్రొఫెసర్ డా. కె. గాంధీ ప్రేరణాత్మక ప్రసంగం

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 19: పాలకొండ పర్యటనలో భాగంగా కేశవ సాయి జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రముఖ విద్యావేత్త, కోల్కత్తా ఐఐఎం విసిటింగ్ ప్రొఫెసర్, మాజీ ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు, గణితం మరియు డేటా సైన్స్ రంగాల్లో అనేక గ్రంథాల రచయిత డా. కొరికాడ రాజారామ్ గాంధీ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఐఐటీ, ఐఐఎం విద్యా వ్యవస్థల విశిష్టత, వాటి ద్వారా లభించే అవకాశాలు, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎలా సాధించాలనే అంశాలను వివరించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనా దృక్పథం గురించి చేసిన ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి. రమణ, గణిత శాస్త్ర అధ్యాపకులు చౌదరి వెంకటరమణ, తెలుగు అధ్యాపకులు ఇప్పిలి లక్ష్మణరావు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు గేదెల మహేందర్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగు ఉపన్యాసకులు వావిలపల్లి అచ్యుతరావు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.

​న్యూస్ బై: బిఎస్ఎస్ ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments