తోటపల్లి పాత రిజర్వాయరు షట్టర్ల మరమ్మతులకు నిధులు: రైతుల నిరీక్షణ

తోటపల్లి భారీ నీటి ప్రాజెక్టు పరిధిలోని పాత రిజర్వాయరు షట్టర్ల మరమ్మతులకు మన్యం జిల్లా అభివృద్ధి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక నిధులు కేటాయించడం శుభపరిణామమని అభ్యుదయ రైతు, వాటర్ రిసోర్సర్ ఖండాపు ప్రసాదరావు తెలిపారు. ఈనెల 8న పార్వతీపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఈ సమస్యను వివరించగా, ఆమె స్పందించి పాలకొండ సబ్ కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. జూలై మొదటి వారంలో తోటపల్లి ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల చేయనుండటంతో, కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉందని, ఈలోగా షట్టర్ల మరమ్మతులు పూర్తవుతాయా లేదా అని పాలకొండ శివారు భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు విడుదల మార్గదర్శకాల ప్రకారం ముందుగా కాలువ చివర భూములకు నీరందించాల్సి ఉన్నా జలవనరుల శాఖ ఆ ఆనవాయితీని విస్మరించిందని, సబ్ కలెక్టర్ వీలైనంత త్వరగా సమావేశ తేదీని నిర్ణయించాలని ప్రసాదరావు మరియు రైతులు కోరుతున్నారు

Post a Comment

0 Comments