టీచర్లకు ప్రత్యేక టెట్: డిసెంబరులో నిర్వహించాలని నిర్ణయం

పాలకొండ వెబ్ న్యూస్, 16 జూన్ 2026: ఉపాధ్యాయ అర్హత పరీక్ష విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని, దీనిని ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ఫైలు పెట్టింది. టీచర్లందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయుల నుంచి డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో పలు విద్యా రంగ అంశాలపై ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారీని వేర్వేరుగా కలిశారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక టెట్‌కు సానుకూల నిర్ణయం వచ్చింది. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో 15 వేల మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు అర్హత సాధించగా, మిగిలిన వారి కోసం ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments