ఉత్తమ గ్రంథాలయ అధికారిగా బబ్బురు గణేష్ బాబుకు సత్కారం

పాలకొండ వెబ్ న్యూస్, 15 జూన్ 2026: వేసవి శిక్షణా శిబిరం నిర్వహణలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే ఉత్తమ గ్రంథాలయ అధికారిగా పాలకొండ శాఖా గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభను మరియు నిబద్ధతను గుర్తిస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంప్ 2026 లో లైబ్రరీ మరియు లెర్నింగ్ కమ్యూనిటీకి చేసిన విశేష సేవలకు గాను ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పి.విఠల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.వి.జి. శంకర రావు పాల్గొని గణేష్ బాబును ఘనంగా సన్మానించారు. గ్రంథాలయాల అభివృద్ధికి, విద్యార్థులలో పఠనాభిలాషను పెంచడానికి ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments