ఎండల వేడికి ఉపశమనం: కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ పంపిణీ

​పాలకొండ వెబ్ న్యూస్, 06 జూన్, 2026:

​పాలకొండ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల, ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ధర్మశాస్త్ర పీఠం పాలకొండ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు చల్లని మజ్జిగ పంపిణీ, గ్లూకోజ్ నీరు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు అటుగా వెళ్లే ప్రజలు కూడా ఈ వేసవి వేడిని తట్టుకునేలా మజ్జిగను అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు కోరారు. ఇక ప్రతి రోజు మజ్జిగ, గ్లూకోస్ వాటర్  పంపిణీ కార్యక్రమానికి దాతలు ఆర్థికంగా సహకరిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ చల్లని మజ్జిగ కేంద్రాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments