పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డి. అప్పారావు బాధ్యతల స్వీకరణ

పాలకొండ వెబ్ న్యూస్, 17 జూన్ 2026:​ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయనగరం నందు వృక్ష శాస్త్ర అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న డి. అప్పారావు పదోన్నతిపై పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాలకొండ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమములో కళాశాల సిబ్బంది యావన్మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యా అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమన్వయ సహకారంతో విద్యార్థుల శ్రేయస్సు కొరకు మరియు కళాశాల సర్వతో ముఖాభివృద్ధికి సర్వ విధాలా కృషి చేస్తానని తెలిపారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments