ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన పాలవలస రమేష్ కుమార్

పాలకొండ వెబ్ న్యూస్, 18 జూన్ 2026: సుమారు మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన పాలవలస రమేష్ కుమార్ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తీసుకువచ్చారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పేర్కొన్నారు. బుధవారం రేగిడి మండల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రమేష్ సేవలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ సంఘాలకు అతీతంగా ఏ ఉపాధ్యాయుడికి ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించేవారని తెలిపారు. అనంతరం పాలవలస రమేష్ కుమార్ రమాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలవలస ధవళేశ్వరావు, వెలమల మన్మధరావు, కడగల వెంకటరమణ, తుమ్ముగుంట అయ్యప్ప, శంకర్, కిల్లారి మోహన్ రావు, దుప్పాడ పాపి నాయుడు, కొడెం విజయకుమార్, దుంపల రమేష్ బాబు, ఎంఈఓ 2 బి ఎరకయ్య, ఉపేంద్ర నాయుడు, మీసాల సత్యం నాయుడు, డబ్బాడ ప్రసాదరావు, మురపాక వెంకటరమణ, పక్కి శివప్రసాద రావు, ఎం.వి రమణ, భాసూరు శ్రీధర్ బాబు, భాసూరు శివ బాల, లక్కాపురం మురళీకృష్ణ, ఎస్కే బుజ్జి, నిరోష్, పాలవలస కృష్ణకుమార్, కరకవలస నారాయణరావు, సాహిని శ్రీనివాసరావు, సన్నీ బాబు, రామకృష్ణ, కాంతారావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments