బిడ్డిక ఉషారాణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 18, 2026: ​పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన విద్యావంతురాలైన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని అతి కిరాతకంగా హత్య చేసిన హత్యాకోరులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సిపిఐ ప్రతినిధి బృందం ఈరోజు ఉషారాణి తల్లిదండ్రులు బిడ్డిక చిన్నారావు, కామమ్మలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఆదివాసి జేఏసీ ఇచ్చిన డిమాండ్లను పక్కాగా అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ పరామర్శలో సిపిఐ మండలం కార్యదర్శి ద్వారపూడి అప్పల నాయుడు, మహిళా సమాఖ్య నాయకురాలు బుడితి భారతి, సిపిఐ నాయకులు బొండపల్లి రాములు, కూరంగి గౌర్నాయుడు, గిరిజన సమాఖ్య నాయకులు బిడ్డిక గణపతి, నిమ్మక బాబురావు, బిడ్డిక ఆనందరావు, రవి, రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments