పాలకొండ టౌన్ లోని సత్య సాయి జూనియర్ కళాశాల విద్యార్థులకు పాలకొండ శక్తి టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి ఒక్కరూ మొబైల్స్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, అందులోని పదకొండు ఫీచర్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. స్నేహితులతో బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలని, తిరిగి వచ్చే వరకు కమ్యూనికేషన్ లో ఉండాలని, తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోకూడదని సూచించారు. బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాలపై వివరించారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా, బాధ్యతతో ఉపయోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ సమస్యలపై తల్లిదండ్రులకు, కళాశాల ప్రిన్సిపాల్ కు లేదా పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు మహిళ ఏఎస్ఐ ఝాన్సీ భాయ్, మహిళ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ ప్రకృతాంబ, కానిస్టేబుల్ రాము, చంద్రశేఖర్, కళాశాల కరెస్పాండెంట్ డి వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ సింహాచలం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments