పాలకొండ వెబ్ న్యూస్, 18 జూన్ 2026:ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాల్సిన పాత్ర ఎంతైనా ఉంది. ఈ దృక్పథాన్ని నిజం చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్‌రెడ్డిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తిచేసిన క్రిష్ ధరణ్‌రెడ్డి, ప్రస్తుతం పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో పదో తరగతిలో చేరారు. ఒక జిల్లా మేజిస్ట్రేట్ కుమారుడు తమ బడిలో చేరడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు. ఈ సానుకూల నిర్ణయం ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments