ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేసిన జోనల్ కార్యదర్శి బి ఎస్ రాములు

పాలకొండ వెబ్ న్యూస్, 20 జూన్ 2026:

​విజయనగరం జోన్ లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పాలకొండ డిపో ఏపీ పిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి బి ఎస్ రాములు ముఖ్య అతిథిగా హాజరై अधिकारियों తీరు పై మండిపడ్డారు. జోన్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్నిసార్లు యాజమాన్యం కు తెలియ చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి స్కీం వలన ప్రత్యక్షంగా సేవలు అందించుచున్న డ్రైవర్ కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి యాజమాన్యానికి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబెట్టారు. కేంద్ర కార్యాలయం ఇచ్చిన 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, కాలం చెల్లిన టీం మిషన్ లకు బదులుగా కొత్త టీం లను సిబ్బంది కీ ఇవ్వాలని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. మిగతా సమస్యల పై యాజమాన్యం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి కే రావు, పి ల్ రావ్, డిపో అధ్యక్షుడు ఎస్ టి రావు, బి ఎస్ రావు, డి జి రావు, అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments