పాలకొండలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం

పాలకొండ వెబ్ న్యూస్, 21-06-2026: పాలకొండలోని సత్య సాయి బాబా ఆలయ ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ డిపోల నుండి రిటైర్డ్ కార్మికులు, రాష్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలైన కార్మికుల సమస్యలు, బస్సు పాస్ సౌకర్యాలు, పెన్షన్ మరియు ఇతర అంశాలపై విపులంగా చర్చించారు. ఈ కార్యక్రమ వేదికను పాలకొండ సత్యసాయి సేవా సమితి వారు ఉచితంగా అందించగా, కార్మికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

​ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర అధ్యక్షులు వీపియన్ రెడ్డి, రాష్ట్ర ట్రెజరర్ రాజారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ కోటేశ్వరరావు, బి డి ఆర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, శ్రీకాకుళం రీజియన్ సెక్రెటరీ టీవీ రావు, జాయింట్ సెక్రెటరీ ఆర్ త్రినాథ్, ఎన్వి రమణ, అర్జీ రావు, నాగయ్య, పి రామారావు, పి మధు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments