కోట దుర్గ అమ్మవారి ఆలయానికి ఆడియో పరికరాల విరాళం

పాలకొండ వెబ్ న్యూస్, 27-06-2026:
పాలకొండ గ్రామ నివాసితులు పాడి మైత్రి, రాజశేఖర్ దంపతులు ఈరోజు స్థానిక కోట దుర్గ అమ్మవారి దేవస్థానానికి విరాళం అందజేశారు. ఆలయ అవసరాల కోసం వారు 97,700 రూపాయల విలువైన అహూజా కంపెనీ యాంప్లిఫైయర్, 14 మైకులు, మరియు వైర్‌ను సమర్పించారు. ఈ విరాళాన్ని స్వీకరించే కార్యక్రమంలో దేవాలయ అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగినట్లు కోట దుర్గ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ తెలియజేశారు. భక్తులు సమర్పించిన ఈ పరికరాలు ఆలయానికి ఎంతగానో ఉపయోగపడతాయని అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడి రామకృష్ణ, జి పారి నాయుడు తదితరులు పాల్గొన్నారు 

Post a Comment

0 Comments