పాలకొండ వెబ్ న్యూస్, 11 జూన్ 2026:పాలకొండ పట్టణంలో నేనెందుకు పుట్టాను.. పుస్తక పునరావిష్కరణ కార్యక్రమం జరగనుంది. అధ్యాత్మిక రత్న హరిభక్త పారాయణ మహంత్ బ్రహ్మశ్రీ మరడాన నాగేశ్వరరావు, కామేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ పుస్తకాన్ని గాయత్రీ ఉపాసకులు బ్రహ్మశ్రీ కంచుమోజు రామ్మోహనరావు ఆవిష్కరించనుండగా, ఏపిటిఎఫ్ మన్యం జిల్లా ప్రతినిధి మర్రపు మహేష్ పుస్తక సమీక్షకులుగా వ్యవహరిస్తారు. ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సామంతుల దామోదర రావు హాజరవుతారు. అలాగే ఎన్ వి రమణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో జల్లు నారాయణరావు, అయ్యప్ప శంకర్, జడ్డు జగ్గారావు, కే బి ఏ నారాయణ సాయి, అరటికట్ల కామేశ్వరరావు, జల్లు బాబ్జి ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. కోట దుర్గ తల్లి గుడి దగ్గర ఉన్న అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జల్లు నారాయణరావు, తుమ్ముగుంట శంకరరావు అందరినీ ఆహ్వానిస్తున్నారు.news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments