కారు మబ్బులు సందే చీకటి కలిసి నేస్తాలాయ్యేవి
ఊరికి ఉత్తరానా సన్నటి మెరుపు తలక్కుమనేది
మెరుపునీడ అమ్మ తలకు రాసిన నూనెలో జిగేల్ మనేది
సన్నటిధార చివిచివికి జడివానై ఊరు ఏరుయ్యేది
పక్కింటి సీనుగాడు సిరుగుల గొడుగు ఊచలు సరిచేసి
వానకి ఎదురెల్లి ఈడ్చికొట్టే జల్లుకి వీపుఇచ్చి వళ్ళంతా తుల్లింతై
జోరువానలో జట్లుకట్టి తూణిగల్లా జం జం మంటూ తిరిగి
వర్షం వెలిసే వరకూ అలుపె మరచి వీధివిది తిరిగి ముచ్చట్లేసి
వీధి కాలువ లో కాగితాల పడవులు వేసి వీధి సివరకు సాగనంపి
తడిసినందుకు అమ్మశివాట్లు తిని వేడివేడిఅన్నం అవురావు మంటూ
తిని నులక మంచం బొంతు పై ముడుచుకొని పడుకొన్న బాల్యమా నీకు నీకు జేజేలు మళ్ళీ నువ్వేప్పటికీ రావు
మళ్ళీ అమ్మ ఎప్పుడూ తిట్టదు ఎందుకంటే నేను మీ ఇద్దర్ని
వదిలి చాలా దూరం వచ్చేసాను.. మళ్ళీ కలవలేనంత
సెలవా మరి...జ్ఞాపకాల బాల్యమా... సెలవిక....
**** రచయిత.. నూతలపాటి భారత భూషణ్ రాజు
కవితా వివరణ
ఈ కవిత.. కోల్పోయిన బాల్యం పట్ల ఒక అందమైన నివాళి, అలాగే వర్తమానంలో మిగిలిన ఒంటరితనంపై ఒక ఆర్ద్రమైన నిట్టూర్పు. కవి తన చిన్ననాటి వర్షపు జ్ఞాపకాలను, అమ్మ ప్రేమని, ఊరి వాతావరణాన్ని ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టారు.
0 Comments