స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధులు నిర్వర్తించేందుకు గాను లుంబురు గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది రౌతు సత్యనారాయణను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. సత్యనారాయణ పాలకొండ కోర్టులో 1998వ సంవత్సరం నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన ఈ సందర్భంగా పాలకొండకు చెందిన సీనియర్ న్యాయవాదులు మురళీమోహన్, కర్రా రవి, గోవిందరాజు, రామ్మోహన్ తదితరులు రౌతు సత్యనారాయణను కలిసి అభినందించారు.
news by: BSS ప్రసాద్,
పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments