భాసూరు పాఠశాలలో నూతన క్రీడా కోర్టుల ప్రారంభం, ఉపాధ్యాయురాలికి ఘన వీడ్కోలు

పాలకొండ వెబ్ న్యూస్, 30 జూన్, 2026: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భాసూరులో నూతనముగా ఏర్పాటు చేసిన వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ కోర్టులను పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి ప్రారంభించారు.  అనంతరం ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా సుమారు 43 సంవత్సరములు సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి వృత్తియే పరమ దైవంగా భావించి పనిచేసిన ఎం.వి లక్ష్మీకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో పాలకొండ మండల ఎంపీపీ ప్రతినిధి బొమ్మాలి సుధాకర్, పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయులు జామి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్

పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments