పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆదేశాల మేరకు బుధవారం నక్కలపేటలోని పల్లా కొండబాబు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ వర్క్‌షాప్ సమావేశం నిర్వహించారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి, సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌చార్జి పల్లా కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పడాల భూదేవి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పింఛన్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుమ్మడి సింహాద్రి మాట్లాడుతూ ప్రతి వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాసపు సర్వారావు, ఆకుల కుమార్, అడపా బాబ్జి నాయుడు, సారిపల్లి సంతోష్ కుమార్, ఎం. అప్పలనాయుడు, బొమ్మలాట స్వర్ణరాణి, కోల లక్ష్మి, దుమ్ముద దుర్గారావు, దుప్పాడ నారాయణరావు, తైలాపు సూర్యారావు, జన్నుల మోహన్ కుమార్ బుజ్జి, ఆర్. గోవిందరావు, ఎన్ని వెంకటనాయుడు, పడాల రాంబాబు, నమ్మి కృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments