పాలకొండ వెబ్ న్యూస్, 27 జూన్ 2026:పట్టణంలో పశువులను రోడ్లపైకి, మార్కెట్లలోకి వదలకూడదని కమిషనర్ పి.వి.నూకరాజు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పశువులను రోడ్లపైకి వదలడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, రోడ్లు అపరిశుభ్రం కావడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మార్కెట్లలోకి వదలడం వల్ల ప్రజలకు, చిన్నపిల్లలకు అంతరాయం కలుగుతోందని, పశువుల పేడతో మార్కెట్ అంతా అపరిశుభ్రంగా మారి శానిటేషన్‌కు ఇబ్బందిగా తయారవుతోందని పేర్కొన్నారు. వాహనాలపై వెళ్లేవారిని ఆవులు పొడుస్తున్నాయని, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పశువులను సంరక్షించుకునే బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. రోడ్లపై, మార్కెట్లలో బహిరంగంగా పశువులు కనిపిస్తే గొల్లవీధి వద్ద ఉన్న బందిల దొడ్డికి తరలిస్తామని, యజమానులు చలానా కట్టి పశువులను విడిపించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పశువులను రోడ్లపైకి, మార్కెట్లలోకి వదలకుండా సొంత స్థలంలో సంరక్షించుకోవాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments