పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి. హర గోపాల్ కు పిహెచ్‌డి అవార్డు

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 4, 2026:పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి. హర గోపాల్ కు హైదరాబాద్ గీతం యూనివర్సిటీ పిహెచ్‌డి అవార్డు ప్రదానం చేసింది. డాక్టర్ విజయానందని కన్నన్ నేతృత్వంలో భౌతిక శాస్త్రంలో ఫెరోమాగ్నెటిక్ నానోస్ట్రక్చర్స్‌ పై ఆయన చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. స్పింట్రానిక్స్ ఆధారిత మెమరీ, లాజిక్ పరికరాలు, భవిష్యత్ న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధికి ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. వి. హరగోపాల్ 2002 నుండి వంగర, రాజాం, పొందూరు కళాశాలల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా సేవలందించి, 2024 నుండి పాలకొండ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సాధించిన ఈ ఉన్నత విద్యా మైలురాయి పట్ల కళాశాల సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments