అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పాలకొండలో బైక్ ర్యాలీ

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 05:

​అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాలకొండ ఋషి యోగ కేంద్ర సభ్యులచే ధనుంజయ్ గురూజీ నేతృత్వంలో శుక్రవారం ఒక భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో యోగా విద్య పట్ల మరియు దాని ప్రాముఖ్యత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ధనుంజయ్ గురూజీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న యోగ మాస్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే నిత్యం యోగ సాధన చేయడం ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలో యోగ సాధకులంతా ఉత్సాహంగా పాల్గొని, యోగా విశిష్టతను చాటిచెప్పేలా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

1 Comments