పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 5, 2026:ఎన్జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం జె కె క్రికెట్ ప్రీమియం లీగ్ నియోజకవర్గస్థాయి హారహోరి పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతి యాభై వేల రూపాయలను సీతంపేట కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతి ముప్పై వేల రూపాయలను బిటివాడ సాధించింది. మూడు మరియు నాలుగు స్థానాల్లో నిలిచిన భామిని, బత్తిలి జట్లకు పది వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు, షీల్డ్లు, మెమొంటోలను స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మరియు కూటమి నాయకులు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ సుమారు ఇరవై రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంటులో నాలుగు మండలాల నుండి నూట యాభై ఐదు టీములు పాల్గొనడం సంతోషదాయకమన్నారు. పోటీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించిన నిర్వాహకులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, సహకరించిన కూటమి నాయకులకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి, మీడియాకు మరియు ప్రేక్షకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం వాలీబాల్, కబడ్డీ, కోకో పోటీలతో పాటు మహిళా జట్ల మధ్య కూడా క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించారు.
news by: BSS Prasad
0 Comments