పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారాలు అందించారు. అలాగే అన్నవరం పిహెచ్‌సిలో కూడా గర్భిణీ స్త్రీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 45 మందికి, అన్నవరం పిహెచ్‌సిలో 35 మందికి ఈ ఆహార పొట్లాలను అందజేశారు. ప్రతి నెల 9వ తారీఖున సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుపుతున్నామని సమితి నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ పోషకాహార వితరణ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చిన గర్భిణీ స్త్రీలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని సమితి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments