పరిసరాల పరిశుభ్రతే దైవత్వానికి తొలి మెట్టు

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 06-06-2026

​పరిసరాల పరిశుభ్రతే దైవత్వానికి తొలి మెట్టు అని నిరూపిస్తూ తెర్లాం మండలం డి గదబ వలసకు చెందిన సాయిరాం మందిరం సేవకులు, పాలకొండ యువకులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం వీరంతా కలిసి పరిశుభ్రత కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం, ఆలయ పవిత్రతను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తోటి సమాజానికి ఆదర్శంగా నిలిచేలా సాగిన ఈ సేవ అందరిలోనూ గొప్ప ప్రేరణను నింపుతోంది. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో పాల్గొనవచ్చు. ఈ పవిత్ర సేవా కార్యక్రమం ప్రతి శనివారం, బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. భగవంతుని సేవతో పాటు ఆలయ క్షేత్రాలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ మోటివేషనల్ గా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments