పాలకొండ శాఖా గ్రంథాలయాన్ని సందర్శించిన కమిషనర్ పి.వి.నూకరాజు

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 9: స్థానిక నగర పంచాయతీ ఎదురుగా ఉన్న శాఖా గ్రంథాలయాన్ని కొత్త కమిషనర్ పి.వి.నూకరాజు ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం గ్రంథాలయ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పరిసరాలన్నింటినీ త్వరలోనే శుభ్రం చేయించి బాగుచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన స్థానిక గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ అభ్యర్థులకు అవసరమైన కొత్త కాంపిటీటివ్ పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయానికి వచ్చిన పలువురు రీడర్స్ తో కమిషనర్ స్వయంగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

​ పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments