జూలై 16 నుండి పాలకొండలో జగన్నాథ స్వామివారి రథోత్సవాలు

పాలకొండ వెబ్ న్యూస్, 15-07-2026: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ దేవాదాయశాఖ జగన్నాథ స్వామివారి దేవాలయంలో జగన్నాథ స్వామివారి రథోత్సవములు అతివైభవముగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 16-07-2026 గురువారం నుండి 26-07-2026 ఆదివారం వరకు జరుగుతాయి. 16న మొదటి రథయాత్ర తొలి దశమి, 17న ప్రత్యేక పూజలు, అభిషేకములు, 18న మత్స్యావతారం, 19న కూర్మావతారం, 20న వరాహ నరసింహస్వామి అవతారం హేరాపంచమి నిర్వహిస్తారు. అలాగే 21న వామన పరశురామ, 22న రామ బలరామ, 23న కల్కి జగన్మోహిని అవతారములు ఉంటాయి. 24న మారుదశమి నిజరూప దర్శనం, 25న తిరుగు రథాయాత్ర, 26న స్వామివారు ప్రధాన దేవాలయ ప్రవేశం చేస్తారు. లక్ష్మీదేవి, స్వామివారుల వాదన, స్వామివారి చరిత్ర కథ రూపంలో ఆలయ ప్రధాన అర్చకులు మఠం విశ్వనాథ దాసు చెప్పెదరని ఆలయ కార్యనిర్వహణాధికారి కే పరమేశ్వరి తెలిపారు. భక్తులు ఈ దశావతారములు, రథయాత్రలను దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించాలని కోరారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments