కోటదుర్గమ్మ ఆలయంలో వైభవంగా వనదుర్గ మహోత్సవం

​పాలకొండ వెబ్ న్యూస్ 14.7.26: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయంలో జ్యేష్ట అమావాస్య సందర్భంగా వనదుర్గ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మి ప్రసాదశర్మ అమ్మవారిని మొక్కల మధ్య ప్రతిష్టించి, వనదుర్గగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జ్యేష్ట అమావాస్య రోజున అమ్మవారిని ఇలా పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పూజలో ఉంచిన మొక్కలకు పూసిన మొదటి పుష్పాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా గ్రహదోషాలు నశిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రకృతి సమతుల్యతలో వృక్షాల పాత్రను గుర్తించి, చెట్లను దైవంగా భావిస్తూ ఈ పూజలు చేస్తారు. పూజ అనంతరం ఆ మొక్కలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.

Post a Comment

0 Comments