ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే అప్పగించాలి: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఉద్యోగుల వినతి

పాలకొండ వెబ్ న్యూస్, 15-07-2026: నూతనంగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగుల ప్రతినిధులు పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఉద్యోగుల భద్రత, ఉపాధి అవకాశాలు మరియు ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే కొత్త బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలని కోరారు. వినతిని స్వీకరించిన ఎమ్మెల్యే, ఈ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన విధంగా ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డిపో జేఏసీ కన్వీనర్లు వావిలపల్లి రాజేష్, బి కే మూర్తి, Ld నాయుడు మరియు డి జీరావు, వి రమణ, సాగర్, పి ఎల్ రావు, స్వరాజ పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం:

Post a Comment

0 Comments