ఏపీఎస్ఆర్టీసీ పాలకొండ బస్ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అసిస్టెంట్ మేనేజర్ V.రమేష్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎల్ రాము, జోనల్ సెక్రెటరీ బాసూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ 1952లో ఆవిర్భవించిన ఈ యూనియన్ నిరంతరం కార్మిక సమస్యలపై పోరాడుతూ ఆర్టీసీని పరిరక్షిస్తోందని అన్నారు. ఆర్టీసీలో జరిగిన 16 వేతన సవరణలలో 13 సార్లు ఎంప్లాయిస్ యూనియనే మెరుగైన వేతనాలు సాధించిందని, క్యాజువల్ కార్మికులను రెగ్యులర్ చేయించిన ఘనత కూడా దీనిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్ ఆధ్వర్యంలో హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేకులు, స్వీట్లు పంచి, 500 మందికి అన్నదానం చేశారు. వేడుకలలో జిల్లా నాయకులు సూర్యనారాయణ, నాగరాజు, రాములమ్మ, డిపో నాయకులు సాగరు, దామోదర్ నాయుడు, వెంకటరమణ, స్వరాజ్యం, విజయ్ బాబు, రాజేంద్ర కుమార్, రాజారావు, అలీ బేగు, సతీషు, ఆఫీసు, సందీపు, ఉమా, శంకరరావు మరియు కార్మికులు పాల్గొని భవిష్యత్తు కార్యక్రమాలకు పూర్తి మద్దతు ప్రకటించారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments